logo

క్వారీ పనుల పునః ప్రారంభాన్ని అడ్డుకున్న రాజన్నపేట గ్రామస్తులు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రాజన్నపేట గ్రామంలో బోడి మెట్ట వద్ద గల బొప్పన నా కన్స్ట్రక్షన్ వారి పనుల పున ప్రారమాన్ని రాజన్నపేట, వడ్డీ పా, బుచ్చంపేట గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. గతంలో ఈ క్వారీ వలన వచ్చే ఇబ్బందులు, ప్రభుత్వం దృష్టికి ప్రజలు తీసుకెళ్లడం జరిగింది. దీనిపై అధికారులు స్పందించి క్వారీ పనులను నిలుపుదల చేయడం జరిగింది. కానీ వారి యాజమాన్యం కొందరి రాజకీయ నాయకుల అండదండలతో మరల క్వారీ పనులను పునః ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్వారీ పనుల వల్ల జలుమూరి సత్తిబాబు అనే వ్యక్తి గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగింది అలాగే క్వారీ లారీలు తిరగడానికి చెరువును కప్పి రోడ్డుని వేశారు. దీనిపై గ్రామస్తులు ఫిర్యాదు చేయగా తాసిల్దార్ స్పందించి రోడ్డును పునర్నిర్మించి వారిని నిలుపుదల చేశారు. అయినా ప్రస్తుతం వారి యాజమాన్యం మరల ప్రారంభించుటకు పూనుకుంది ఈ పనులను నిలిపివేయాలని చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి క్వారీ పనులు నిలుపుదల చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా న్యాయం చేయాలని కోరారు












10
1215 views