logo

పత్రికా సంపాదకులకు.. సత్కారం..!!

AIMA MEDIA : ఆగష్టు 6:బుధవారం, విశాఖపట్నం..

న్యూస్ 9 :-విశాఖపట్నం జిల్లా,.. పత్రికా సంపాదకులకు అరుదైన గౌరవం, దక్కింది.. ఈ రోజు బుధవారం, విశాఖపట్నం జర్నలిస్ట్ ఫారం క్లబ్ లో ఈ కార్యక్రమం జరిగింది.. అని జఫ్ జిల్లా అధ్యక్షులు పత్రికా సంపాదకులకు ఘన సత్కారం...జరిగింది

జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎం కీర్తన్, జే వి కే అప్పలరాజుల ఆధ్వర్యంలో...


*ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ అభివృద్ధికి పత్రికల కృషి అమోఘం : ప్రముఖ విద్యావేత్త కే.సంజీవి...


సమాజ అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పత్రికలు పోషించే పాత్ర ఎంతో ప్రశంసనీయమని శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల చైర్మన్ కే సంజీవి అన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఎం కీర్తన్, జే వి కే అప్పలరాజుల ఆధ్వర్యంలో చిన్న దినపత్రికల సంపాదకులకు ఘన సత్కారం జరిగింది. వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పత్రిక సంపాదకులను శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కే సంజీవి మాట్లాడుతూ ప్రజల విశ్వసనీయతను పొందేందుకు పత్రికలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ స్వాతంత్ర్య సమపార్జనలో ఆనాడు పత్రికలు పోషించిన పాత్రను గుర్తు చేశారు. సంపాదకులు పాఠకులకు విశ్వసనీయ సమాచారాన్ని పారదర్శకంగా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిధి పత్రికలేనని, పత్రికలు పోషించే పాత్ర పైనే ఆ దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. నేడు చిన్న పత్రికలను నడపడం ఎంతో కష్టమని అన్నారు. నేడు చిన్న దినపత్రికలు సమాజంలో పోషిస్తున్న పాత్రను సంజీవి కొనియాడారు. చిన్న పత్రికలను కూడా ఓ పరిశ్రమగా చూడాలని అభిప్రాయపడ్డారు. పత్రికా సంపాదకులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడంలో చిన్న పత్రికలు ఎప్పుడూ ముందుంటున్నాయని అభినందించారు. చిన్న పత్రికల నిర్వహణ నేడు ఎంతో కష్టంగా ఉందన్నారు. చిన్న పత్రికలకు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాబోయే రోజుల్లో చిన్న పత్రికల ఎడిటర్లతో కలిసి తమ యూనియన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాప్ గౌరవ సలహాదారుడు గంటా చంద్రశేఖర్, వడ్డాది ఉదయ్ కుమార్, పి.ఎ.ఆర్.పాత్రుడు, ఉప అధ్యక్షులు
గొట్టివాడ దనేష్ ,సందీప్, జాప్ నేతలు కె పృధ్వీరాజ్, సాయి, రాపర్తి శ్రీనివాసరావు, , , ఎస్ ఎన్ నాయుడు, వెంకట్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

6
36 views