
మమ్మల్ని చులకనగా చూస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందంటున్న బలిజ సంఘం
ఆళ్లగడ్డ నియోజకవర్గ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎం వి ప్రసాద్ అధ్యక్షులు నల్లగట్ల బాలుడు అర్జీ నరసింహులు ఆధ్వర్యంలో గురువారం రోజున శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సందర్భంగా పట్టణంలోని గవర్నమెంట్ కాలేజీ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మైలేరీ మల్లయ్య మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాధినేత ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయుల కాలంలో రాయలసీమలో ప్రజలు వీధుల్లో రత్నాలను రాశులుగా పోసి అమ్మిన చరిత్ర కలిగిన చక్రవర్తి దేశభాషలందు తెలుగు లెస్స అని సంబోధించిన మహారాజు దక్షిణ భారతదేశ మొత్తాన్ని ఏకచక్రాధిపత్యముగా పరిపాలన చేసి క్రీస్తు శకం 07 -08 -1509
శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అలాగే నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావడానికి, ఆళ్లగడ్డ నుండి అమరావతి వరకు ఇతర వర్గాలతో పాటు, అత్యధికంగా బలిజలు ఓటు వేసి గెలిపించారని కావున బలిజ సంఘీయుల కోరిక మేరకు ఆళ్లగడ్డలో బలిజలకు కళ్యాణ మండపము మరియు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు కొరకు సహకరించాలని మమ్మల్ని చులకనగా చూస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాందాసు, ఆకుల చిన్న వెంకటసుబ్బయ్య, సిద్ధి నారాయణ, ఆకుల నడిపి వెంకటసుబ్బయ్య, గుత్తి నరసింహుడు, కొల్లం పుల్లయ్య, జింక వెంకటస్వామి, వెంకటసుబ్బయ్య , వీరయ్య, ఆంజనేయులు, మద్దిలేటి, పార్శా నరసయ్య, ఉల్లి సుబ్బరాయుడు, ఈశ్వరయ్య , శ్రీరాములు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.