డా. అన్నాభావు సాఠే గారి 105వ జయంతి ఎక్స్‌రోడ్ లింగాజీ తండాలో ఘనంగా నిర్వహణ
ఉట్నూర్, ఆగస్ట్ 8: లోక షాహీర్, సాహిత్య సమ్రాట్ డాక్టర్ అన్నాభావు సాఠే గారి 105వ జయంతి వేడుకలు ఉట్నూర్ డివిజన్‌లోని ఎక్స్‌రోడ్ లింగాజీ తండాలో శుక్రవారం నాడు సాంస్కృతికంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
డా. సాటే గారి చిత్రపటానికి పుష్పాంజలి అర్పించడంతో పాటు, ఆయన సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకున్నారు.
వారి సంకల్పం, రచనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు.