logo

వారం వ్యవధిలోనే దొంగతనం కేసును చేదించిన ఆళ్లగడ్డ పోలీసులు

నంద్యాల జిల్లా.ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి వీధిలో ఈనెల 2వ తేదీన జరిగిన చోరీ కేసులో ముద్దాయిలను అరెస్టు చేశారు పట్టణ సీఐ యుగంధర్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు శనివారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న సంజీవ రాయుడు అనే వ్యక్తి ఈనెల 2వ తేదీ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో చర్చీలో ప్రార్థన కోసం వెళ్లడం జరిగింది ఆసమయంలో ముద్దాయిలు ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 1,27,500 నగదు, మూడు తులాల బంగారు నగలను చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి టౌన్ ఎస్ఐ జయప్ప, పోలీస్ సిబ్బంది గట్టి నిఘా ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల వ్యవధిలోని కేసును చేదించారు
ముద్దాయిలు సంతోష్ , విజయ భాస్కర్, నాగేంద్ర, వరలక్ష్మి అనే వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని ముద్దాయిలను రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు కేసును ఛేదించిన సీఐ యుగంధర్, ఎస్సై జయప్ప, కానిస్టేబుల్ రఫీ, అక్బర్, హోంగార్డు శేఖర్ లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ అభినందించారు.

234
11401 views