logo

వికాస తరంగిణి చే ఉచిత డిపి షుగర్ వ్యాధి నిర్ధారణ శిబిరం

తొర్రూరు ఆగస్టు 9 (AIMEMEDIA ) డివిజన్ కేంద్రంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో వికాస్ తరంగిణి ణి తొర్రూర్ శాఖ వారి నిర్వహణలో శనివారం రోజునఅలాగే ఈ రోజు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన జీయ్యర్ స్వామి వారి మంగళా శాసనములతో "ఉచిత షుగర్ బిపి పరీక్షలు డాక్టర్ అనిల్ కుమార్ భూఖ్య నేతృత్వం లో శిబిరం ను నిర్వహించారు ఇందులో 104 మందికి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు పరీక్షలు చేయించుకున్న వారు సంతోషం వ్యక్తంచేస్తూ ఆలయ ప్రాంగణం లో ఉపాహార ప్రసాదం తో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వికాస తరంగిణి వారిని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అనిల్ కుమార్ కి అభినందనలు తెలిపారు. అదేవిధంగా "శాశ్వత శనివార ఉపాహార ప్రసాద కైంకర్య సేవ " శ్రీవారి సేవలో శనివారం పట్టణ ప్రముఖ హాస్పిటల్ పద్మావతి నర్సింగ్ హోం అధినేత డాక్టర్ కొత్త యాదగిరి రెడ్డి జన్మదిన సందర్బంగా , విశేషమైన శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు జగద్రక్షకుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి ఆవిర్భావించిన రోజు రాఖీ పౌర్ణమి రావడం ఎంతో అదృష్టం పుణ్యం ప్రసాదం అందించిన వారు స్వీకరించిన వారు ఆలయాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. డాక్టర్ కొత్త యాదగిరి రెడ్డి ఆలయ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి స్వామి వారి శేష వస్త్రం తో సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్ కుందూరు గీతా రాజేందర్ రెడ్డి వికాస తరంగిణి సభ్యులు ఆలయ కమిటీ. భక్తులు పాల్గొన్నారు.

2
78 views