"రాఖీతో మరింత బలపడిన అన్నా–చెల్లెల్ల అనుబంధం"
మచిలీపట్నం,ఆగస్టు 09:
రాఖీ పండుగ సందర్భంగా అన్నా–చెల్లెల్ల బంధం మరింత బలపడింది. ఉదయం నుంచే చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీలు కట్టి, వారి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. అన్నలు కూడా తమ చెల్లెళ్లకు బహుమతులు అందించి, సంతోషపరిచారు. ఈ సందర్భంగా కుటుంబాల్లో స్నేహం, ప్రేమ, పరస్పర గౌరవం మరింత పటిష్ఠమవుతున్న దృశ్యాలు కనిపించాయి.ఈ పండుగ వెనుక ఉన్న సాంప్రదాయం, సోదర సోదరీమణుల అనుబంధం గురించి చర్చించారు. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ ప్రేమతో, ఆప్యాయతతో ఈ పండుగను జరుపుకున్నారు.