logo

యండకుర్తి అప్పలరాజు కి “స్వర కిరీటి” జాతీయ ప్రతిభా పురస్కారం

SINGERS FEST – 2025 ఘనంగా శనివారం ఏలూరులో తెలుగు సంగీత ప్రతిభకు వేదికగా నిలిచిన శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక గుర్తింపులతో సాగే ఈ వేడుకలో, 151వ ఈవెంట్ సందర్భంగా అనకాపల్లి పట్టణం కిచెందిన గాయకుడు, స్నేహశీలి, స్వర్ణకారుడు అయిన యండకుర్తి అప్పలరాజు గారికి “స్వర కిరీటి” జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు పి.కల్యాణ్ మాట్లాడుతూ “సంగీతం అనేది సమాజానికి ఆనందం, ఐక్యతను అందించే శక్తివంతమైన కళ, ప్రతిభావంతులైన గాయకులను గుర్తించి సత్కరించడం ద్వారా మరింత ప్రోత్సాహం కలిగిస్తాం” అని అన్నారు. ఈ వేడుకలో పలు రాష్ట్రాల నుండి ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు పాల్గొని తమ గానంతో ప్రేక్షకులను అలరించారు.ఈ జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నందుకు గాను పలువురు రాజకీయ ప్రముఖులు, మిత్రులు తోటి గాయకులు ఎండకుర్తి అప్పలరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.

7
2858 views