logo

దీనస్థితిలో ఉన్న అన్నమయ్య పార్కును పునరుద్ధరించండి - బల్లా నాగభూషణం

Akarsh Anakapalli:అనకాపల్లి పట్టణంలో శారదా నది వంతెన కి ఆనుకొని ఉన్న అన్నమయ్య పార్కును పునరుద్ధరించాలంటూ సిద్ధార్థ సోషల్ సర్వీస్ మరియు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం తో పాటు అసోసియేషన్ సభ్యులు దీనస్థితిలో ఉన్న పార్క్ ని పునరుద్ధరించాలంటూ ప్లేకార్డ్స్ ప్రదర్శించి నిరసన తెలియజేశారు. అనంతరం అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ అనకాపల్లి శారదా నది ఒడ్డున ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని మొక్కలతో నిండి ఉన్నటువంటి పార్కులో 21 అడుగులు ఎత్తైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్య విగ్రహాన్ని పెట్టి ప్రస్తుతం ఆ విగ్రహాన్ని సైతం అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఆ పార్కు ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిందని దీనిని తక్షణమే జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ ప్రధాన కమిషనర్, అధికారులు వెంటనే దృష్టి సారించి ఈ పార్కును వెంటనే పునరుద్ధరించి ప్రజలకి వాడుకులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి విన్నకోట నీలేష్ గుప్తా, ఉపాధ్యక్షులు కృష్ణ, రామారావు, రమణ మూర్తి, లక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

0
88 views