logo

ఈనాడు సీనియర్ సబ్ ఎడిటర్ కడియం ఆచార్య అమర్ స్మారక జ్ఞాపిక అందుకోవడం పూర్వ జన్మ సుకృతం -సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ నేమాల

ఆకార్ష్ విశాఖపట్నం:ఈనాడు పత్రిక ప్రారంభo నుంచి సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేసి 1996లో రిటైరై గత నెలలో పరమపదించిన కడియం ఆచార్య అమర్ స్మారక వుపన్యాస సభను ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం పూర్వ విభాగాధిపతి, ఒంగోలు ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం విసి డివిఆర్ మూర్తి హాజరై జర్నలిజం విలువలు ప్రస్తుత పోకడలు అంశంపై కీలకోపన్యాసం చేశారు.
ఈ స్మారక వుపన్యాస కార్యక్రమానికి
ఆచార్య అమర్ తో కలిసి పనిచేసిన
ఈనాడు చీఫ్ ఎడిటర్ (రిటైర్డ్) బి.సర్వేశ్వరరావు,
పి వెంకటేశంలు హాజరై ఆయనతో వారికున్న అనుబంధాన్ని.., జర్నలిజం వృత్తిలో ఆయనకున్న నైపుణ్యం,నిబద్ధత క్రమశిక్షణను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలువురు పత్రికా సంపాదకులకు ఉపసంపాదకులు పాత్రికేయులకు ఆచార్య అమర్ స్మారక జ్ఞాపికలను సర్వేశ్వరరావు,
వెంకటేశంలచే అందజేశారు.
ఈ సందర్భంగా వారితో పాటు జ్ఞాపిక అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ నేమాల హేమసుందరరావు మాట్లాడుతూ తాను కూడా 1997-98 మధ్య కాలంలో గాజువాక ప్రాంతంలో ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ గా ఈ కార్యక్రమ అతిథులు వెంకటేశం ఎడిషన్ ఇంచార్జిగా..,
న్యూస్ బ్యూరో ఇంచార్జ్ సర్వేశ్వరరావుల వద్ద పని చేయడం గర్వకారణంగా ఉందన్నారు.అలాగే ఈనాడు సీనియర్ సబ్ ఎడిటర్ కడియం ఆచార్య అమర్ స్మారక జ్ఞాపిక వారిచే అందుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.
వేదిక మీద వారివురు నన్ను గుర్తించి అభినందించడం ఆనందదాయకమన్నారు.
తనకీ అద్భుతమైన అవకాశం కల్పించిన జాప్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఎం కీర్తన, జేవీకే అప్పలరాజుతో పాటు దివంగత ఆచార్య అమర్ కుటుంబ సభ్యులకు డాక్టర్ నేమాల కృతజ్ఞతలు తెలిపారు.

10
1429 views