logo

పులివెందులలో పులుల్లా 🐯 వస్తున్న ఓటర్లు

గత 30 సంవత్సరాల నుండి కడప జిల్లా. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నిక జరగలేదు. నోటిఫికేషన్ విడుదలయిన నాటి నుండి పులివెందుల నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు జడ్పీటీసీ ఎన్నికలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. వైసీపీ సీనియర్ నాయకులందరూ అక్కడే మొహరించారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేశారు. పోలీసులకు ఈ ఉప ఎన్నికలు తలనొప్పిగా మారాయి. రిగ్గింగ్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరుగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. కామేపల్లి, యర్రబల్లెలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఓటర్లు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా ఓటింగ్ లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం నుండి బారులు తీరారు. అయితే కొన్ని చోట్ల మాత్రం తమను లోపలికి అనుమతించడం లేదని ఓటర్లు చెబుతున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపారు. ఓటు వేయకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానికులు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో తిరుగుతూ ఉండటం వలన కొంత టెన్షన్ నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలింగ్ కేంద్రంలోని టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణలు అనేక చోట్ల తలెత్తాయి. ఇటు ఒంటిమిట్టలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది.

102
4800 views