రాజధాని అమరావతి జిల్లా కేంద్రంగా మారనుందా?
అమరావతి రాజధాని జిల్లా కేంద్రంగా మారనుందా అనే ప్రశ్న ఇప్పుడు CRDA పరిధిలో సందిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతుంది. దీనిపై ఈనెల 13వ తేదీన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామతో పాటు పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గాన్ని కూడా అమరావతిలో కలుపుతారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.