logo

కొడిమ్యాలలో ఘనంగా చెన్న దేవేందర్ పుట్టినరోజు వేడుకలు

కొడిమ్యాల, ఆగస్టు 12 ( న్యూస్ ) జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలో పద్మశాలి మాజీ అధ్యక్షుడు చెన్న దేవేందర్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా పద్మశాలి సభ్యులు, యువకులు ఆయనను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, మిత్రులు, బంధువులు, కుల పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, స్నేహభావంతో పుట్టినరోజు వేడుకను మక్కువతో నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్న దేవేందర్ మాట్లాడుతూ ఈ ప్రేమాభిమానానికి నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువత, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

8
1012 views