స్వర కిరీటి పురస్కార అవార్డు గ్రహీత యండకుర్తి అప్పలరాజుకు అభినందనలు
అనకాపల్లికి చెందిన గాయకుడు యండకుర్తి అప్పలరాజుకు 'స్వర్ణ కిరీటి'ప్రతిభ పురస్కారం లభించింది. ఏలూరులో తెలుగు అసోసియేషన్ నేషనల్ అకాడమీ,గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సింగర్ ఫెస్ట్-2025 జరిగింది. అద్భుతమైన ప్రతిభతో యండకుర్తి అప్పలరాజు కు స్వర కిరీటి పురస్కారం పొందాడు. ఈయనను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర అభినందించారు.