logo

దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ పట్టణంలోని TS ఫంక్షన్ హాల్ నందు మంగళవారం రోజున జాతీయ యువత దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ASK AKHILA అనే కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు.
జాతీయ యువత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రవేట్ మరియు ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థులు పలు సమస్యలపై ఎమ్మెల్యే అఖిల ప్రియ ను అభ్యర్థించారు
ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యం అందడం లేదని, గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యానికి రోడ్లు సరిగా లేవని, విద్యా వ్యవస్థలో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించే దిశలో కృషి చేయాలని, అలాగే నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతకు, ఉద్యోగాలు ఉపాధి కల్పన దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువతపై ఆధారపడి ఉందని సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యనైనా సరే విద్యార్థులు యువత నా దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా సమస్యను పరిష్కరించి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని
నేటియువత సరైన మార్గంలో క్రమశిక్షణతో కలిగిన జీవితాన్ని జీవించే విధంగా అటు కళాశాలలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

28
1399 views