logo

సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు సిట్ కు అప్పగించాం: నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్*

తెలంగాణ స్టేట్**ఆగస్టు 12**( ఏఐఎంఏ మీడియా)

సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు సిట్ కు అప్పగించాం: నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్*

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును సిట్ కు బదిలీ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఆగస్టు 12న ఆమె మీడియాతో మాట్లాడుతూ...జులైలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నట్లు చెప్పారు. ఈ కేసులో మొదట 8 మందిని, తర్వాత 16 మందిని అరెస్టు చేశామని, అరెస్ట్ అయిన వారిలో వైద్యులు, ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. రెండో కేసులో చనిపోయిన బేబీని చూపించి బాధితుల నుంచి రూ.10 నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారని చెప్పారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాను నిలిపివేశామని, గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ఉన్న లైసెన్స్ నంబర్, లెటర్ హెడ్స్లో వీరు అక్రమాలు చేశారన్నారు. ఆమె ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేశామన్నారు. సికింద్రాబాద్ లో సృష్టి సెంటరు అనుమతులు లేకుండానే నడిపిస్తున్నారని తెలిపారు. ప్రధాన ఏజెంట్ అయిన ధనశ్రీ సంతోషి మరికొందరిని సబ్ ఏజెంట్లుగా నియమించుకొని నెట్ వర్క్స్ విస్తరించిందని వెల్లడించారు. విశాఖ నుంచి పిల్లల వైద్యురాలు విద్యుల్లత, వైద్యులు రవి, ఉష వీరి కోసం పనిచేశారని తెలిపారు.

ఈ కేసులో సరోగసీ, అండదానం చేసే వారిగా కొందరు మహిళా ఏజెంట్లు నటించారని, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మా వర్కర్లు కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. 9 నెలలు పూర్తవుతున్న గర్భవతులను గుర్తించి సరోగసీ కోసం వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించేవారన్నారు. మగ బిడ్డకు రూ. 4.5 లక్షలు, ఆడబిడ్డ రూ. 3లక్షల ధర నిర్ణయించారని తెలిపారు. ఇలాంటి సెంటర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమతులు ఉన్న వాటినే సంప్ర దించాలని డీసీపీ సూచించారు...

98
1519 views