logo

మోత్కూర్ ను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి

గుండాల:కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళితే గుండాల తాహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో 119 నియోజవర్గాలు ఉండగా అదనంగా 34 కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి గుండాల,అడ్డగూడూరు,ఆత్మకూరు మోటకొండూరు మండలాలను అనుసంధానం చేస్తూ మోత్కూర్ మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి ఆర్.ఐ ప్రభు కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సత్యనారాయణ బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమిల నరసయ్య,జాంగిర్,మస్తాన్,లింగస్వామి,మల్లయ్య,బిక్షం,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

0
121 views