logo

NCC, AVN కాలేజీ విద్యార్థుల కు, సీటీ కమీషనర్,... సూచనలు, సలహాలు..

AIMA MEDIA :ఆగస్టు 12:మంగళవారం :విశాఖపట్నం
AIMA న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా పరిధిలో గల విశాఖపట్నం పురాతన విద్యా సంస్థ అయిన AVN కాలేజ్ NCC, ర్యాగింగ్ క్యాడర్ విద్యార్థుల సీటీ కమీషనర్ శంఖ బాగు్చి సలహాలు, సూచనలు ఇచ్చారు, ఈ కార్యక్రమం లో ముందుగా, ర్యాగింగ్ వద్దు, చదువే ముద్దు,, అనే నినాదం తో, విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడుతున్నారని, ఇలాంటి తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హేచ్చిరించారు. ఇలాంటి చర్యలు వల్ల విద్యార్థుల భవిష్యత్ పాడువుతుంది అని తెలిపారు.. అంతే కాకుండా AVN కాలేజీ కి ఎంతో చరిత్ర కల్గి ఉండని దాన్ని కాపాడుకుందాం అని తెలిపారు. ఈ కాలేజ్ లో చదివిన ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉన్నత పదవుల్లో ఉన్నారు అని సూచించారు.*వివరాలు లోకి వెళ్తే *
*విశాఖపట్నం సిటీ*
*తేదీ:12-08-2025*

*సుమారు 500 మంది NCC స్టూడెంట్స్ తో యాంటీ ర్యాగింగ్ ర్యాలీ నీ ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు*

ఈ రోజు (12-08-2025) విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 12 నుండి 18 వరకు జరుపుతున్న యాంటీ రాగింగ్ వీక్ సందర్భంగా, AVN కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ సింహాద్రి నాయుడు గారి సమన్వయంతో,
ఇన్స్పెక్టర్ శ్రీ జి డి బాబు వన్ టౌన్ గారి ఆధ్వర్యంలో సుమారు 500 మంది యూనిఫామ్ ధరించిన ఎన్సీసీ క్యాడెట్స్‌తో భారీ ర్యాలీ నిర్వహించబడింది.

ఈ ర్యాలీ AVN కాలేజ్ నుండి ప్రారంభమై, కలెక్టర్ ఆఫీస్ – జగదాంబ చౌక్ – పూర్ణా మార్కెట్ మార్గంలో తిరిగి కాలేజ్ వరకు కొనసాగింది. సిటీ పోలీస్ కమిషనర్ గారు స్వయంగా ర్యాలీకి శుభారంభం చేసి, ర్యాలీతో కలిసి నడుస్తూ ప్రజలకు "రాగింగ్ వద్దు – చదివే ముద్దు", "రాగింగ్ పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు" వంటి నినాదాలు అందించారు. ఈ సందేశం నగరమంతా ప్రతిధ్వనించింది.

ఈ కార్యక్రమంలో డీసీపీ జోన్-2 శ్రీమతి మేరీ ప్రశాంత్, ఏసీపీ హార్బర్ శ్రీ కాళిదాసు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జీ.డి.బాబు గారు ఆధ్వర్యంలోని సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

రాగింగ్ ఒక నేరం. విద్యా సంస్థలు రాగింగ్ లేని సురక్షిత వాతావరణంగా ఉండేలా అందరం కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.


నగర పోలీసు తరపున,
విశాఖపట్నం సిటీ.

8
1876 views