logo

పాలకేంద్రము వద్ద దెబ్బతిన్న రోడ్డు ను మధ్యాహ్నం చూసిన ఎమ్మెల్యే – సాయంత్రానికి రోడ్డు మరమ్మతులు పూర్తి.. హర్ష్యం వ్యక్తము చేసిన ప్రజలు

తొర్రురు ఆగస్టు 12(AIMEMEDIA). ట్టణంలోని పాలకేంద్రం వద్ద రోడ్డు గుంతలు పడి, రోజూ వందలాది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలం కారణంగా గుంతలు మరింత లోతుగా మారి, రెండు చక్రాల వాహనాలు, ఆటోలు, కార్లకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను స్థానికులు, పార్టీ కార్యకర్తలు పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు..మధ్యాహ్నం ఎమ్మెల్యే స్వయంగా ఆ ప్రదేశానికి వచ్చి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేశారు.
ఈ సందర్బంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే వెంట ఉన్నారు. వారు స్థానికులతో మాట్లాడి సమస్యలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకుని చేపట్టిన స్పందనపై కృతజ్ఞతలు తెలిపారు. “మా సమస్యను ఇంత తక్కువ సమయంలో పరిష్కరించ టం మాకు చాలా ఆనందం కలిగించింద న్నారు .సాధారణంగా ఇలాంటి పనులు వాయిదా పడతాయి, కానీ ఈసారి మాత్రం రికార్డు సమయంలో పూర్తయ్యాయి” అని పలువురు వాహనదారులు అభిప్రాయ పడ్డారు.ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చూపిన ఈ తక్షణ స్పందనకు పట్టణంలోని ప్రతి వర్గం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..

9
88 views