ప్రకృతిని కొలిచే పండుగ తీజ్
ఘనంగా తీజ్ వేడుకలు ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రవి నాయక్
ఖమ్మం జిల్లా ఆర్ కోడ్ తండ తీజ్ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు గత తొమ్మిది రోజుల క్రితం నాటిన గోధుమలు చల్లగా అవి పైరుగా పెరగడంతో వాటిని బుట్టలల్లో పేర్చి సమీప చెరువుల్లో నిమగ్నం చేశారు. అనంతరం జగదాంబమాతకు యాటపోతును బలిచ్చి సేవలాల్ మహారాజ్ కు ఆర్ కోడ్ తండాలొ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రవి నాయక్ మాట్లాడుతూ ప్రకృతిని కొలిచేదే పవిత్ర పండగ తీజ్ పండగని అన్నారు. ఈ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలని కోరారు. పెళ్లి కానీ యువతులు వారికి మంచి భర్త రావాలని ఈ వేడుకలను నిర్వహించుకుంటారు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ పండుగకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేయాలని. గిరిజనుల ఆరాధ్య దైవం అయిన తీజ్ పండగ రోజు ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తండావాసులు తదితరులు పాల్గొన్నారు....