బీసీ వెనుకబడిన సంక్షేమ వసతిగృహ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సమావేశం.
నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA):
నంద్యాల జిల్లా సాయిబాబా నగర్ బీసీ కళాశాల వసతి గృహంలో బీసీ వెనుకబడిన సంక్షేమ వసతిగృహ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.నంద్యాల నూతన జిల్లా అధ్యక్షుడిగా శ్రీ డి. మునిరాజుని బీసీ వెనుకబడిన సంక్షేమ వసతి గృహ సంక్షేమ సంఘం వసతి గృహ హాస్టల్ వార్డెన్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల జనరల్ సెక్రెటరీ పి.శ్రీనివాసులు మరియు నంద్యాల జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం ట్రెజరర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. . ఈ సందర్భంగా బీసీ సంక్షేమ వసతిగృహ అధికారుల సంఘానికి నంద్యాల జిల్లా అధ్యక్షునిగా డి .మునిరాజు,జనరల్ సెక్రెటరీగా షబ్బీర్ హుస్సేన్,, ట్రెజరర్ గా శ్రీ మేరీ సూర్య కుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వెనుకబడిన వసతి గృహ అధికారులు వెంకటపతి,, సురేష్, వెంకన్న గౌడ్,, శ్రీనివాస నాయక్ ,,తదితరులు పాల్గొన్నారు.