logo

పెద్ద కర్మ (తెర్వీ) కార్యక్రమానికి హాజరైన గౌరవ పిఎస్సిఎస్ చైర్మన్ ఆడే సురేష్ నాయక్ ...!!

బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి సోదరుడు కీ.శే. రాథోడ్ నర్ సింగ్ గారు ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈరోజు కీ.శే. రాథోడ్ నర్ సింగ్ టీచర్ గారి తేర్వి కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం టేలర్స్ కాలనిలోని వారి నివాసంలో చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ పిఎస్ సిఎస్ చైర్మన్ ఆడే సురేష్ నాయక్ గారు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి మనో ధైర్యాన్ని ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బంజారా ప్రముఖులు ఉద్యోగులు రాజకీయ నాయకులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు...

2
238 views