
ప్రకృతిని ఆరాధించే పండుగగా పేరుపొందిన ఈ పండుగ,ప్రకృతి ప్రేమికులు గిరిజనులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్.బి.ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బానోత్ రవి నాయక్
ఘనంగా గిరిజనుల తీజ్ పండుగ ఉత్సవాలు
లంబాడి ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు అత్యంత సాంప్రదాయంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగగా పేరుపొందిన ఈ పండుగ,ప్రకృతి ప్రేమికులు గిరిజనులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్.బి.ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బానోత్ రవి నాయక్ ఖమ్మం జిల్లా ఆర్ కోడ్ తండా ఈరోజు ఆర్ కోడ్ తండా గ్రామంలో లంబాడి గిరిజనుల తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తొమ్మిదో రోజు తీజ్ పండుగ ముగింపు వేడుకల్లో ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భానోత్ రవి నాయక్ పాల్గొని ప్రసంగిస్తూ లంబాడి సంస్కృతి,సాంప్రదాయాలకు అద్ధం పట్టే తీజ్ పండుగ ఎంతో పవిత్రమైనదని లంబాడి ఆడబిడ్డలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని ఇది లంబాడీల ఐక్యతకు నిదర్శనమని తండాలు ఎంతో సుభిష్టంగా ఉండాలని పంట పైరు పశు సంపద అన్నియు పచ్చగా ఉండాలని,వర్షాలు సమృద్ధిగా కూరవాలనే ఉద్దేశంతో పండుగ గొప్పదనమని ప్రాముఖ్యత ఉంటుందని సోదరీ,సోదరుల మధ్య సోదర భావాన్ని పెంపొందించే పండుగ నేటి కాలంలో ఇది ఎంతో ప్రాచీర్యం పొందిందని ఆయన అన్నారు. 9 రోజులపాటు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజించి ముగింపుగా తొమ్మిదవ రోజు తీజ్ బుట్టలలోని గోధుమనారును నిమజ్జనం చేయడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో తండా పెద్దలు మరియు తండా వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.