
ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- ఆగస్టు 15 న స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఎన్జీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్
ఎస్ ఇలక్కియ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- ఆగస్టు 15 న స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఎన్జీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్
ఎస్ ఇలక్కియ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామనే హామీ మేరకు కూటమి ప్రభుత్వం 2025 ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 శుక్రవారం సాయంత్రం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సిటీ టెర్మినల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను బుధవారం ఎన్జీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎస్. ఇలక్కియ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో జరిపిన సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి ప్రాంగణానికి వచ్చే ఏరియాలో ఏవిధమైన ట్రాఫిక్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచిస్తూ, వారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమం జరిగే ప్రాంతంలో తీసుకోవాల్సిన పోలీసు బందోబస్తు చర్యలను ఉన్నతాధికారులతో చర్చించారు. వేలమంది పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ లోని సిటీ టెర్మినల్ కు వస్తారని వారికి కావలసిన త్రాగు నీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. సాధారణ ప్రజలకు ఏవిధమైన అడ్డంకులు కలగకూడన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. నగరంలో ట్రాఫిక్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, బస్సులకు ఏవిధమైన అంతరాయం కలగకుండా సజావుగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తి అయ్యే వరకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరు మహిళలే వస్తున్నందున్న దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ శానిటేషన్ అధికారులకు సూచించారు. సమీక్ష అనంతరం వేదిక వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అంతేకాకుండా పబ్లిక్ గ్యాలరీ తదితరమైన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. గౌరవ ముఖ్యమంత్రి వచ్చే ప్రదేశం, వెళ్లే ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించే బస్సులు ఉంచే ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పరిశీలించారు.
కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, డీసీపీ (ఐఎస్ డబ్లూ) ఎస్వీడీ ప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎమ్.వై. దానం, ఆర్టీసీ ఈడీ జీ. విజయ రత్నం, అసిస్టెంట్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ నాన్ క్యాడర్ ఎస్సీ టి. శోభా మంజరి, ఏసీపీ సౌత్ (లా అండ్ ఆర్డర్) డి. పవన్ కుమార్, ఆర్ అండ్ బీ డీఈ శశిభూషణ్, సెంట్రల్ ఎమ్మార్వో వెంకట్రామయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.