బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తేది:-13-8-2025. పవర్ తెలుగు దినపత్రిక:
వివరాల్లోకి వెళితే.మందమర్రికి చెందిన సాయి *వెంకటేష్ S/o బానయ్య, age:-27, కులం:-మాదిగ, వృత్తి :-సింగరేణి ఉద్యోగి, (RK-7 మైన్) నివాసం :-గాంధీనగర్.అను వ్యక్తి తేది:-12-8-2025 రోజున TG19బెటర్ 0214 నెంబర్ గల తన బైక్ మీద పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లి, పని అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణంలో తన బైక్ మీద వస్తుండగా మార్గమథ్యంలో 09:15 గంటలకు బొక్కలగుట్ట వద్ద గల నేషనల్ హైవే రోడ్డు దగ్గర గల గాంధారి మైసమ్మ దేవాలయం వద్దకు రాగా అక్కడ TG18T-1989 అను నెంబర్ గల లారీనీ దాని డ్రైవర్ అజాగ్రతగా ఎలాంటి ఇండికేటర్స్ లైట్ వేయకుండా వెయ్యకుండా రోడ్డు మీద ఆపడంతో, సాయి వెంకటేష్ తన బైక్ నడుపుతూ అట్టి లారీనీ ఢీ కొట్టడంతో తీవ్రగాయలు అవడంతో, అతన్ని మంచిర్యాల లోని ప్రభుత్వ హాస్పిటల్ కు చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయాడని SI.. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు ఇట్టి సంఘటన మీద మృతుడి బావ ఇచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI.. రాజశేఖర్ తెలిపారు.*