సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.
నంద్యాల రిపోర్టర్/ మోహన్ (శుభోదయం న్యూస్ ):
పేద ప్రజలు ఆపదలో ఉంటే ‘నేనున్నాను’ అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల టిడిపి కార్యాలయం (రాజ్ టాకీస్) నందు లక్ష 53 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఫరూక్ గారి చేతుల మీదుగా గోస్పాడు మండలం దేవగుంట్ల గ్రామానికి చెందిన పవన్ కుమార్ కు 1,25,000 , నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన పుల్లా రెడ్డి కి 28,000 రూపాయలు బాధ్యత కుటుంబానికి అందజేయడం జరిగింది .. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.