logo

పంచాయతీల్లో రేపు ప్రత్యేక గ్రామసభలు.

మూడు కీలక అంశాలపై గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15న ప్రత్యేక గ్రామసభలు నిర్వ హించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను బుధవారం ఆదేశించింది. పునరుత్పాదక ఇంధన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, పశుసంవర్ధకశాఖ సహకారంతో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం, పంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంపై ప్రధానంగా గ్రామసభల్లో చర్చించి తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది. స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తా యని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది.

0
12 views