logo

పలమనేరు ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కృషి.



*పలమనేరు ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అభివృద్ధి*

*ట్రామాకేర్, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కృషి*

*రోగుల సౌకర్యర్థం లిఫ్ట్ మరియు సోలార్ సిస్టమ్ ఏర్పాటు*

*మెరుగైన సేవాలందించడమే ధ్యేయం*

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ,, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఉద్ఘాటన*

*ఏరియా ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ, ,ఎమ్మెల్యే*

పలమనేరు


పలమనేరు ఏరియా ఆసుపత్రిని అన్ని రకాల సేవలు అందించే జిల్లా ఆసుపత్రిగా (అప్ గ్రేడేషన్) అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు,పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి సంయుక్తంగా తెలియజేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా శుక్రవారం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన గార్డెన్, ఆక్సిజన్ ప్లాంట్, టేబుల్స్, చైర్స్ ను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు . తర్వాత ఆసుపత్రిలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి అజెండాలో పొందుపరచిన 11 అంశాలకు ఆమోదం తెలిపారు ఎంపీ ఎమ్మెల్యేలు. ఆసుపత్రికి అవసమైన సోలార్ సిస్టమ్, వైద్య సిబ్బంది కొరత, యూనిఫామ్స్ కొనుగోలు, స్టేషనరీ కొనుగోలు, రికార్డులు భద్రపరచడానికి అవసమైన వసతి సముదాయాలకు సంబంధించిన అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, రోగుల పట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని సూచించారు . ఆసుపత్రికి వచ్చే కేసులను రెఫర్లు చేయకుండా స్థానికంగానే సేవాలందించేలా చూడాలన్నారు. ఓపి సేవలతో పాటు ఎమర్జెన్సీ కేసుల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్, ట్రామా కేర్ సేవలన్నీ అందేలా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని, అందుకు అవసమైన ఎస్టిమేషన్ లు త్వరగా రూపొందించాలని సూచించారు. అనంతరం పలువురు సిబ్బందిని వారు అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణా రెడ్డి, బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు అర్వీ బాలాజీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నాగరాజు, సుధాకర్, చంద్రకళ, వైద్యులు శారదా దేవి, సుబ్రహ్మణ్యం, యుగంధర్, మీనాక్షి లతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు.

16
2433 views