logo

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుబీర్ లో సామాజిక సేవకునికి ఘనంగా సన్మానం: గణితము బోధించిన ఉపాధ్యాయునికి పాదాభివందనం చేసిన సామాజిక సేవకుడు.

(AIMA MEDIA:-నిర్మల్ జిల్లా బ్యూరో, ఆగష్టు 16)

కుబీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న కుబీర్ గ్రామ వాస్తవ్యులు డాక్టర్ సాప అందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సట్ల గంగాధర్, ఉపాధ్యాయ బృందం ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ నేను చదువుకున్న పాఠశాలలో ఈ సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉందని, అదే విధంగా మాకు గణితము బోధించిన ఉపాధ్యాయునికి పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, నాయకులు సూది రాజన్న, మంగలి సాయినాథ్, విద్యార్థులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

6
3112 views