శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించిన శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల.
నంద్యాల జిల్లా/ పాణ్యం (AIMA MEDIA):
పాణ్యం మండలం నెరవాడ పరిధిలోని శాంతిరం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల కోసం వివిధ రకాల కళలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు మరియు జ్ఞాపికలు పంపిణీ చేశారు.కళాశాల ప్రిన్సిపాల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ, భగవద్గీత బోధనలను ఆచరణలో పెట్టుకోవాలని అందరికీ పిలుపునిచ్చారు.విద్యార్థుల భక్తి, ప్రతిభను ప్రతిబింబించే విధంగా పాటలు, నృత్యాలు, గుంపు నృత్యాలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో అన్ని విభాగాధిపతులు, డీన్లు, అధ్యాపకులు, బోధనాేతర సిబ్బంది మరియు సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.