logo

చిన్న ఎక్లారాలో వరద భయాందోళన, అధికారుల సమయానుకూల చర్యలు..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : మద్నూర్ మండలం చిన్న ఎక్లారా గ్రామంలో గుట్టపై నుండి భారీగా నీరు గ్రామంలోకి వెంటనే చేరడంతో గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హుటాహుటిన జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు హన్మాండ్లు స్వామిని అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. తక్షణమే గ్రామానికి చేరుకున్న హన్మాండ్లు స్వామి, సమస్యను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి,సహాయక చర్యలు చేపట్టారు. జేసిబి సహాయంతో నీరు గ్రామంలోకి చేరకుండా మళ్లించి బయటకు తరలించారు.ఈక్రమంలో స్థానిక గ్రామ నాయకులు సమన్వయం చేసి ముప్పునునివారించారు. పరిస్థితిని సబ్ కలెక్టర్ కిరణ్మయి, మద్నూర్ ఎమ్మార్వో ముజీబ్, ఎంపీడీఓ, సీఐ రవి, ఎస్ఐ విజయ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ట్రాన్స్కో అధికారులు కలిసి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

5
25 views