అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం బీభత్సం ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి – మాంగ్ సమాజ్ యూనిటీ ఫోరం విజ్ఞప్తి
అదిలాబాద్, ఆగస్టు 16:జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోవడంతో నిరాశ్రయులైన కుటుంబాలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.ఈ సందర్భంలో మాంగ్ సమాజ్ యూనిటీ ఫోరం తరఫున రాష్ట్ర వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీ కాంబ్లే దిగంబర్ గారు పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ “వర్షాల కారణంగా దళిత, గిరిజన వాడల్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. ప్రజలు తీవ్ర కష్టాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పర్యటించి వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలి. అలాగే జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు తోడ్పాటు అందించాలి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం ధైర్యం చెప్పి సహాయక చర్యలను వేగవంతం చేయాలని మా మాంగ్ సమాజ్ యూనిటీ ఫోరం విజ్ఞప్తి చేస్తోంది ” అని పేర్కొన్నారు.అలాగే ఆయన, ప్రజల ప్రాణాలు–ఆస్తులను రక్షించడంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.