వరద ప్రాంతాలు పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి...
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి మద్నూర్ మండలంలోని అంతాపూర్ సోమూరు గ్రామాల మధ్య గల వాగుకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో మద్నూర్, జుక్కల్ మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వెంటనే స్పందిచిన భాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మండలాలకు చేరుకుని వరద మయమైన రోడ్లను, ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అంతాపూర్ సోమూరు మధ్యగల వాగును సందర్శించారు. మధ్యాహ్నానికి వరద నీరు తగ్గిపోవడంతో బ్రిడ్జి వద్ద రహదారిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అర్ అండ్ బి శాఖ ఏఈని ఆదేశించారు. భారీ వర్షాల మూలంగా అధికారులంతా అలర్ట్ గా ఉండాలని ఆమె తహశీల్దార్, ఎంపీడీఓ, ఎస్సెలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎండి. మూజీబ్, ఎంపీడీవో రాణి, ఎస్సై విజయ్ కొండ, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.