logo

సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

సత్తెనపల్లిలోని నరసరావుపేట రోడ్డుపై గల సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్ నిపుణులు పాల్గొని 450 మందికి పైగా రోగులకు బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ, 2డీ ఎకో, హెచ్బీ1 ఏసీ, ఊపిరితిత్తుల పరీక్షలు, చెస్ట్ ఎక్స్రే వంటి ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఖరీదైన ఔషధాలను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. గుంటూరు కిమ్స్ హాస్పిటల్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఆకుల శివ ప్రసాద్, ఆర్థ్రోపెడిస్ట్ డా. సాయికృష్ణ రెడ్డి సేవలందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలు హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్యులను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉచిత శిబిరాలు నిర్వహించాలని కోరారు. అంతకుముందు, హాస్పిటల్ ప్రాంగణంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ సింగరాజు సాయికృష్ణ, డాక్టర్ సింగరాజు విద్యతో పాటు 90 ఏళ్ల వృద్ధుడు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఆ వృద్ధుడు ఈ అవకాశం కల్పించిన హాస్పిటల్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అందరికీ అల్పాహారం అందించారు

12
440 views