logo

గుడిహత్నూర్ ఎస్సీ కాలనీ జలమయం – సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

గుడిహత్నూర్ మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎస్సీ కాలనీ మొత్తం నీటమునిగిపోయింది. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, ఆహారం, వైద్యసేవలు వంటి ప్రాథమిక అవసరాలు అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం ప్రభావంతో రవాణా, రాకపోకలు అంతరాయం కలిగాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అధిక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

78
4100 views