logo

సీఎం భద్రత అధికారి ఎస్పీ చెన్నుపాటి భద్రయ్యకు రాష్ట్రపతి ప్రతిష్టాత్మక పథకం.

*సీఎం భద్రతా అధికారి ఎస్‌పి చెన్నుపాటి భద్రయ్యకు రాష్ట్రపతి ప్రతిష్టాత్మక పథకం*

అమరావతి, ఆగష్టు 16:
పోలీసు శాఖలో విశిష్టమైన సేవలు అందించి, భద్రతా విధుల్లో అద్భుత ప్రతిభ చాటిన ఎస్‌పి చెన్నుపాటి భద్రయ్యకు రాష్ట్రపతి ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్ లభించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ శౌర్య సేవా పతకాలను ప్రధానం చేయగా, రాష్ట్రానికి చెందిన ఇద్దరు అధికారుల్లో భద్రయ్య ఒకరు. గత పదేళ్లలో ఎనిమిది సంవత్సరాలు వరుసగా అత్యున్నత సేవలకుగాను గుర్తింపు పొందిన ఆయన, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత భద్రతా ముఖ్య అధికారి హోదాలో కొనసాగుతున్నారు.


ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామం లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన భద్రయ్య స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగారు. ఈయన తల్లిదండ్రులు ఆదెయ్య, అలివేలమ్మలకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం కాగా భద్రయ్య అందరికంటే చిన్నవాడు.
స్వయంకృషితో ఎదిగిన భద్రయ్య 1991లో పోలీసు శాఖలో చేరి, సున్నితమైన, సంక్లిష్టమైన విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో కీలక బాధ్యతలు, పుష్కరాలు, రాజధాని అమరావతి శంఖుస్థాపన, అంతర్జాతీయ సదస్సులు, బాంబు నిర్వీర్యం వంటి విభాగాల్లో ప్రతిభ చాటారు. అమెరికా, యుపి రాష్ట్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ఆయన, ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో చాంపియన్‌గా నిలిచి, రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. భద్రయ్య గౌరవానికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, సహచర అధికారులు అభినందనలు తెలియజేశారు.

39
3331 views