logo

77వ సారి డొక్కా సీతమ్మ ఘనంగా అన్నప్రసాద వితరణ

సత్తెనపల్లి :

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద జనసేన పార్టీ నాయకుడు అప్పాపురపు నరేంద్ర ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 77వ సారి నిర్వహించబడింది. ఈ కార్యక్రమం దాత పల్లపు రవివర్మ జన్మదిన సందర్భంగా, ఆయన తండ్రి ముసలయ్య ఆర్థిక సహాయంతో జరిగింది. ఈ సందర్భంగా 140 మంది నిరుపేద ఓపీ రోగులకు, గర్భిణీ స్త్రీలకు, మరియు రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం పంపిణీ చేయబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. అనూష, అప్పాపురపు నరేంద్ర నిస్వార్థ సేవను ప్రశంసిస్తూ, దాతల స్వచ్ఛంద సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్పాపురపు సూర్యకుమారి, సురె రామకోటేశ్వరరావు, కటకం కాశీవిశ్వనాధం, పోతుగంటి నరసింహరావు, కట్టమూరి అప్పారావు, రచ్ఛా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించాలనుకునే వారు 9059447414 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని నిర్వాహకులు కోరారు.

16
1101 views