logo

సిపిఐ ఆధ్వర్యంలో జన సేవాదళ్ ట్రైనింగ్ ఈరోజు హిందూపురం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్ నందు సిపిఐ ఆధ్వర్యంలో

సిపిఐ ఆధ్వర్యంలో జన సేవాదళ్ ట్రైనింగ్

ఈరోజు హిందూపురం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్ నందు సిపిఐ ఆధ్వర్యంలో జన సేవాదళ్ కోచింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈనెల 20 నుండి 25 వరకు ఒంగోలు నందు సిపిఐ రాష్ట్ర మహాసభలో జరుగుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రెడ్ ఆర్మీ జన సేవాదళ్ కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నదాని సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ తెలిపారు

ఈకార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర జనసేవదాల్ కన్వీనర్ మురళి గారు హాజరై సిపిఐ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణ తీసుకున్న 50 మంది కార్యకర్తలు రాష్ట్ర మహాసభలు ఒంగోలు నందు ఈనెల 20 నుండి 25 వరకు జరుగు మహాసభలలో ఈ రెడ్ ఆర్మీ వాలంటీర్లు హాజరవుతారని తెలిపారు

ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి, ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమల్ బాషా, సిపిఐ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, కార్యవర్గ సభ్యులు బాబు, చౌలూరు రవికుమార్, మారుతి రెడ్డి, చాంద్ బాషా, సమివుల్లా, చలపతి, జబివుల్లా, అన్సార్, ఇమ్రాన్, సురేష్, ఏఐఎస్ఎఫ్ ఆదర్శ్, అశోక్, ఆఫ్నాన్, యశ్వంత్, కిరణ్, వంశీ,అజయ్, ఏఐవైఎఫ్ నాయకులు జిలాన్, జియా, లింగప్ప, నాగేంద్ర, పైరోజ్ తదితరులు పాల్గొన్నారు

14
816 views