logo

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా **చండ్రుగొండ మండలం **ఆగస్టు 16 **(ఏఐఎంఏ మీడియా)


అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్,

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ఉదయం చంద్రుగొండ మండలం బెండాలంపాడు గ్రామంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పోలీసు అధికారి రోహిత్ రాజు, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలసి సంబంధిత శాఖల అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈనెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చంద్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో పర్యటించి, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు.


కలెక్టర్ మాట్లాడుతూ –
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సభాస్థల నిర్మాణం, వేదిక రూపకల్పన, అతిథుల కూర్చునే సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు, రవాణా, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం, అగ్నిమాపక సిబ్బంది, భద్రతా చర్యలు వంటి అంశాలను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉన్నత ప్రమాణాలతో ఉండాలని, ఎక్కడా చిన్నపాటి లోపం చోటుచేసుకోకుండా శాఖల అధికారి స్థాయి నుండి ఫీల్డ్ స్థాయి సిబ్బంది వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ, విద్యుత్ సరఫరా, తాగునీటి సదుపాయాలు నిరంతరంగా ఉండేలా చూడాలని సూచించారు.


*జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ* –
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో సమగ్ర భద్రతా చర్యలు చేపడతామని, హెలిప్యాడ్ ప్రదేశంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ మినహాయించి వేరే వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రతి విభాగం అధికారులు తమ తమ బాధ్యతలను సమయానికి పూర్తి చేసి, సమన్వయంతో పనిచేస్తే పర్యటనలో ఎటువంటి ఆటంకం కలగదని సూచించారు.

*ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ* –
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బెండాలపాడు గ్రామంలో జరిగే సభాస్థలి, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు.

అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే కలిసి బెండాలపాడు, చంద్రుగొండ, దామరచర్ల, మద్దుకూరు గ్రామాలలోని సభాస్థలి, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

252
5560 views