logo

సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలలో పాల్గొన్న పలు మంత్రులు మరియు టీడీపీ నాయకులు తాళ్ల

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవితమ్మ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్య ప్రసాద్ , కొల్లు రవీంద్ర , ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ , విజయవాడ ఎంపీ చిన్ని , ఎమ్మెల్యే గౌతు శిరీష , ఆచంట ఎమ్మెల్యే సత్యనారాయణ , గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు శ్రీ తాళ్ళ వెంకటేష్ యాదవ్ , గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ సైలజ గౌడ్ , వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు రాష్ట్రంలోని వివిధ హోదాలలో ఉన్న ప్రముఖ నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతికి, స్వాతంత్ర్య పోరాటంలో మరియు రాష్ట్ర రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించబడడం బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలకు నిజమైన గౌరవమని ఆమె అన్నారు.ఈ వేడుకలలో పాల్గొన్న టీడీపీ నాయకులు మరియు ఇతర ప్రముఖులు లచ్చన్న స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని సంకల్పించారు.

4
383 views