మదర్ థెరిసా జయంతి వేడుకలు: విగ్రహం వద్ద న్యాయవాదుల నివాళులు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు రోడ్డు వద్ద ఉన్న మదర్ థెరిసా నిలువెత్తు విగ్రహం వద్ద ఆమె జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముందుగా మదర్ థెరిసా విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం, న్యాయవాదులు మాట్లాడుతూ మదర్ థెరిసా సేవాతత్పరతను కొనియాడారు. ఆమె భారతదేశంలో, ముఖ్యంగా కలకత్తాలోని పేదలకు, అనాథలకు, రోగగ్రస్తులకు అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆమె సేవకు ప్రతిరూపమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్, మాజీ అధ్యక్షులు కొల్లా వెంకటేశ్వరరావు, మద్దినేని వెంకట చలపతిరావు, మదర్ థెరిసా విగ్రహ స్థాపకులు మరియు సీనియర్ న్యాయవాది పూదోట రాజు తదితరులు పాల్గొన్నారు.