logo

నంద్యాల: DYR ఫంక్షన్ హాల్లో ఘనంగా, అంగరంగ వైభవంగా దాసరి మధుసూదన్ రావు పదవీ విరమణ మహోత్సవం

03 నంద్యాల: DYR ఫంక్షన్ హాల్లో ఘనంగా, అంగరంగ వైభవంగా దాసరి మధుసూదన్ రావు పదవీ విరమణ మహోత్సవాన్ని నిర్వహించారు. 3 దశాబ్దాలకు పైగా పోలీసు వృత్తిలో రాణిస్తూ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విరమణ పొందడం సంతోషకరంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఉప్పరివీధి సుంకులమ్మ గుడిలో దాసరి శ్రీ మధుసూదన్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు శ్రీ పద్మావతి..మురళీధర్, శ్రీ పుష్పావతి.. సోమశేఖర్, శ్రీ ప్రియాంక.. మహేష్ కుమార్, ఆశాజ్యోతి.. రమణయ్యలు పూజలు నిర్వహించారు.


అనంతరం DYR ఫంక్షన్ హాల్ లో "న భూతో.. న భవిష్యత్.." అన్న విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, ఆత్మ బంధువులు, పోలీసులు, ఉన్నతాధికారులు, నంద్యాల పట్టణ, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వారికి అభినందనలు తెలిపారు. దాసరి మధుసూదన్ రావు వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. పదవీ విరమణ పొందడం బాధాకరమైనప్పటికీ.. ఉద్యోగ జీవితంలో తప్పదని తెలిపారు.

5
309 views