logo

జేపీ అగ్రహారం ఇనాం భూముల గిల్మన్ సర్వే పూర్తిగా అవాస్తవం. నిజాలు చెప్పటానికి ఎక్కడికైనా వస్తా. వర్మ



అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం ఇనాం భూముల విషయంలో రైతులు ఎవరు అపోహలకు, అసత్యాలకు లొంగవద్దని, కొందరి స్వలాభం కోసం ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, తన వద్ద ఈ భూములకు సంబంధించి అన్ని రికార్డులు ఆధారాలతో సహా ఉన్నాయని, గిల్మన్ సర్వే అనేది విశాఖపట్నం జిల్లాలో లేదని అటువంటి లేని సర్వేని సృష్టించి కొందరు వ్యక్తులు ప్రజలను మభ్యపెడుతున్నారని వర్మ అన్నారు. ఈ భూమి లావాదేవీలపై చాలాసార్లు అధికారులు దృష్టికి, హైకోర్టు కి తీసుకువెళ్లారని హైకోర్టు తీర్పును తనకు అనుకూలంగా ఇచ్చినప్పటికీ కొందరు స్వార్ధపరులు ప్రజలను మభ్య పెట్టేందుకు తనను ఇబ్బంది పెట్టేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో నాయకులు ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో తన వద్దకు వచ్చి మాట్లాడారని దానికి సానుకూలంగా తాను స్పందించారని తెలిపారు. ప్రస్తుతం పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా, బ్యాంకు లోన్ వంటి సదుపాయాలు పొందుతున్నారని, మిగతా రైతులు వేరే వారి మాటలు విని నష్టపోతున్నారని ఇప్పటికైనా నిజం తెలుసుకొని తమ భూమిని తాము తీసుకొని దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని పొందాలని దానికి తన నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి, కోర్టు తీర్పులను వక్రీకరించి రైతులను తప్పుదోవలో పెడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. న్యాయంగా తనకు చెందిన 1/3 భూమి మాత్రమే తనదని మిగతా 2/3 భూమి విషయంలో తన జోక్యం ఉండబోదని దయచేసి రైతులు నిజాలు తెలుసుకోవాలని ఈ విషయంపై తాను ఎప్పుడైనా ఎక్కడికైనా పూర్తి ఆధారాలతో రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు

30
1637 views