logo

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత – శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి

అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకే గర్వకారణం.
నాగజ్యోతి విద్యా రంగంలో తన సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థులలో ఆంగ్లభాషపై పట్టు పెంపొందించడంతో పాటు, వివిధ సహపాఠ్య కార్యక్రమాలు ద్వారా వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, ప్రతిభ, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందించి, విజయవంతంగా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే అనేక అవార్డులు, ప్రశంసలు, ప్రోత్సాహక పథకాలు అందుకున్న ఆమె, ఈసారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో గౌరవించబడడం ఆమె కృషికి లభించిన గొప్ప గుర్తింపు.ఈ ప్రతిష్టాత్మక అవార్డుకి ఆమె 100% అర్హురాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.ఈ అవార్డు రావడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, సహ ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాల ఉపాధ్యాయురాలు రాష్ట్రస్థాయి గుర్తింపు పొందడం పట్ల వారు ఆనందాన్ని పంచుకుంటూ, ఈ విజయాన్ని పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకి ఒక ప్రేరణగా పేర్కొన్నారు. ఈ అవార్డును ఈ నెల 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా తీసుకోనున్నారు

37
664 views