logo

బైపాస్ వివాదం ప్రజల ఆగ్రహం ఉధృతం... – అధికారులు ఎందుకు మౌనం?

నంద్యాల, AIMA మీడియా:

పాములపాడు మండల కేంద్రంలో తాజాగా నిర్మించిన 340 సి బైపాస్ రహదారి స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇంతకుముందు పాములపాడులో ఆగే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు ఇప్పుడు నేరుగా బైపాస్ మీదుగానే వెళ్తుండటంతో, ప్రజలు రాకపోకల్లో పెద్ద ఇబ్బందులు పడుతున్నారు.

పాములపాడు కేంద్రానికి సమీపంలో ఉన్న మిట్ట కందల, మద్దూరు, కృష్ణానగర్, పెంచికలపల్లె, తుడిచెర్ల, ఇస్కాలచెలిమిళ్ళ, లింగాల, కొక్కరంచ, నాంపల్లి గ్రామాల ప్రజలు ప్రధానంగా ఈ రహదారిపైనే ఆధారపడి ఉంటారు. ప్రతిరోజూ వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు బస్సు సేవలతో ప్రయాణం చేస్తుంటారు. అయితే బైపాస్ కారణంగా బస్సులు పాములపాడు కేంద్రానికి రావడం మానేయడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

“ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని” స్థానికులు హెచ్చరిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన చూపకపోవడం మరింత ఆగ్రహానికి దారితీస్తోంది

2
8 views