ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం*
*ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం*
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
మంగళవారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ప్రత్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.