కనిగిరి: 'దివ్యాంగులకు న్యాయం చేయాలి’
అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ధూళిపాల మల్లికార్జున అన్నారు. దివ్యాంగత్వంలో మార్పు లేనిది పర్సంటేజ్లో ఎలా మారిందని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సదరం రీ-వెరిఫికేషన్ ప్రక్రియను రద్దుచేసి గతంలో మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్లను కొనసాగించాలని ఆర్డీవో కేశవర్ధన్రెడ్డికి సోమవారం వినతి పత్రాన్ని అందించారు.