logo

హిందీ భాష పురస్కరించుకొని చిత్ర లేఖన పోటీలు..!!!

AIMA న్యూస్ :SEP 16:మంగళవారం :విశాఖపట్నం
న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా ఆరిలోవ సమీపంలో గల కృష్ణ రాయపురం గురుకుల లో భారతదేశం రాజ భాష అయిన హిందీ భాష పురస్కరించుకొని చిత్ర లేఖన పోటీ నిర్వహించడం జరిగింది అందులో ఐదువ తరగతి నుండి పది వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ పోటిల్లో పాల్గునగా కృష్ణ రాయ పురం గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రము లో ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు అని ప్రిన్సిపాల్ మరియు తోటి ఉపాధ్యాయులు తెలిపారు. వివరాలు లోకి వెళ్తే...భారతదేశపు రాష్ట్ర భాష మరియు రాజభాషా అయినటువంటి హిందీ భాష దినోత్సవం పురస్కరించుకొని హిందీ భాషను అభివృద్ధి పరచాలని ఉద్దేశముతోస్థానిక శ్రీకృష్ణాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈరోజు చిత్రలేఖను పోటీలు నిర్వహించడం జరిగినది.

ఈ యొక్క చిత్రలేఖనంలో ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగినది.

స్థానిక హిందీ మాస్టర్ గా పని చేస్తున్నటువంటి కోట సూర్య ప్రకాష్ రావు గారు మరియు షేక్ మస్తాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

దీనికిగాను ఆర్ట్ టీచర్ పి.సుధాకర్ పర్యవేక్షించారు.
ఈ పోటీలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ బి రత్నపల్లి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగినది .
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సంపత్ లక్ష్మణరావు గారు మరియు స్కూల్ PET గారైనటువంటి జామిశెట్టి వివేకానంద గారు పాల్గొనడం జరిగింది.

35
4263 views