ఐక్య తల్లిదండ్రుల సంఘం సభ్యత్వ నమోదు, ప్రచార కరపత్రాలు పంపిణీ చేసిన ఐక్య తల్లిదండ్రుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారుతీ రత్నాకర్
ఐక్య తల్లిదండ్రుల సంఘం సభ్యత్వ నమోదు మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా సభ్యులను కలసి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మారుతీ రత్నాకర్,ఎ టి ఈ సి జిల్లా అధ్యక్షులు యం.బాలు నాయక్ మరియు ఐక్య తల్లిదండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్ చారి కరపత్రాన్ని అందజేశారు.అభాగ్యులకు అన్నార్థులకు యాచకులకు పట్టెడన్నం కార్యక్రమం,కాలుష్య నియంత్రణ కోసం జూట్ బ్యాగుల పంపిణీ,రక్తదానం,మొక్కలు నాటడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు స్టేషనరీ అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మారుతీ రత్నాకర్ అన్నారు