
బైరెడ్డి సిద్ధారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన నంద్యాల జనసేన నాయకులు
AIMA న్యూస్ బ్యూరో.జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కల్యాణ్ పై వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నంద్యాల జిల్లా జనసేన నాయకులు ఖండించారు. నంద్యాల పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఆదివారం రోజున పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైరెడ్డి అనే ఇంటి పేరు లేకుంటే నీ బతుకు కుక్కలు చించిన విస్తర. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి నీకు లేదు ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదు అంటూ హెచ్చరించారు.151 సీట్లతో అధికారంలోకి వచ్చి 30 సంవత్సరాల పరిపాలన మాదే అని విర్రవీగిన మీ అధినేతను వైసీపీని పాతాళంలోకి తొక్కింది ఎవరో తెలుసుకో సిద్ధారెడ్డి తెలియకపోతే. మీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని అడుగు .గత ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు వారికి అండగా నిలిచి ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల సాయం అందించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. పేదల కోసం, సామాన్యుల కోసం నిత్యం పోరాడే నాయకుడిని విమర్శించడం సిగ్గుచేటు. రాయలసీమ యాసలో మాట్లాడినంత మాత్రాన నువ్వు ఏదో పెద్ద పోటుగాడు అనుకోకు పంది బలిస్తే ఏనుగు అవ్వదు నువ్వు ఒక పిల్ల బచ్చా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఇంకోసారి మా అధినేతపై నోరు విప్పితే మర్యాద దక్కదు అని తీవ్ర హెచ్చరికలు చేశారు